
Rain Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాలకు వర్ష సూచన.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఓ వైపు ఎండలు, మరోవైపు వానలతో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.. ఉదయం వేళ ఎండలు దంచికొడుతుండగా.. సాయంత్రం వేళ ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ వర్ష సూచన చేసింది. ద్రోణి ప్రభావంతో ఆదివారం, సోమవారం పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని.. తెలంగాణలోని పలు జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో ఆది,…