Kitchen Hacks: ప్రతి ఒక్కరికీ ఎంతో ఉపయోగపడే సులభమైన వంటింటి చిట్కాలు..!

Kitchen Hacks: ప్రతి ఒక్కరికీ ఎంతో ఉపయోగపడే సులభమైన వంటింటి చిట్కాలు..!


వంటగది నిర్వహణ ఎక్కువ శ్రమ కలిగించే పని అనిపించవచ్చు. కానీ కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఈ పనిని చాలా సులభం చేసుకోవచ్చు. మీ గ్యాస్ స్టవ్ నుంచి వంట సామానులు వరకు అన్ని శుభ్రం చేయడంలో సహాయపడే ఈ చిట్కాలను సులభంగా అనుసరించవచ్చు. ఇప్పుడు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడంలో ఉపయోగకరమైన కొన్ని వంటగది చిట్కాలను తెలుసుకుందాం.

నెయిల్ పాలిష్

ఎప్పుడైనా నెయిల్ పాలిష్ నేలపై పడిపోతే దాన్ని శుభ్రం చేయడం కష్టం అనిపిస్తుంది. కానీ దాన్ని సులభంగా శుభ్రం చేయడం కొరకు నెయిల్ పాలిష్ ఆరిన తర్వాత తుడవడానికి ప్రయత్నించండి. అది పూర్తిగా పోకపోతే దాని మీద కొంచెం పెర్ఫ్యూమ్ చల్లి తుడవడం వల్ల అది సులభంగా తొలగిపోతుంది. ఇది చాలా సులభమైన చిట్కా.

గ్యాస్ బర్నర్స్

గ్యాస్ బర్నర్లు శుభ్రం చేయడం చాలా మందికి కష్టంగా అనిపిస్తుంది. అయితే ఒక ప్లాస్టిక్ డబ్బాలో కొద్దిగా వెనిగర్, బేకింగ్ సోడా వేసి అందులో బర్నర్లను ఉంచండి. ఆ మిశ్రమం నురుగు వచ్చాక, కొద్దిగా వాషింగ్ లిక్విడ్, నిమ్మ, ఉప్పు వేసి బర్నర్లను సుమారు అరగంట పాటు నానబెట్టండి. ఈ ప్రక్రియ ద్వారా బర్నర్ల మీద ఉన్న మురికి సులభంగా పోతుంది. అవసరమైతే మురికి ఉన్న ప్రదేశాలను తేలికగా రుద్దడం ద్వారా అవి మరింత శుభ్రంగా మారతాయి.

అల్లం, వెల్లుల్లి

సాధారణంగా వంటకాల్లో అల్లం, వెల్లుల్లిని దంచి లేదా తురిమి ఉపయోగిస్తారు. అయితే కాయ తురుముతో తరిగితే వంటకు మరింత రుచి కలుగుతుంది. ఇది అమలుచేయ దగిన చిట్కాగా, వంటకాలకు అదనపు రుచిని అందించడంలో సహాయపడుతుంది.

ఎగ్స్

గుడ్డు పొట్టును సులభంగా తీసేయడం కోసం గుడ్లను ఉడకబెట్టే ముందు వాటర్ లో కొద్దిగా ఆయిల్ వేయండి. ఇలా చేయడం వల్ల గుడ్ల పొట్టును తీసేయడం చాలా ఈజీ అవుతుంది. వంట సమయాన్ని కూడా ఇది తగ్గిస్తుంది.

ఎగ్స్ ను కట్ చేయడం

ఎగ్ ను కత్తితో కట్ చేయడం కంటే.. దారంతో కట్ చేయడం ఉత్తమం. దారంతో ఎగ్ ని కట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి మీరు ప్రయత్నించి చూడండి.

నిమ్మరసం

నిమ్మరసం సరిగా తీసేందుకు స్లాట్డ్ చెంచా ఉపయోగించండి. ఈ పద్ధతి ద్వారా నిమ్మ గింజలు చెంచాలోనే ఉండిపోతాయి. తగినంత రసం మాత్రమే బయటకు వస్తుంది. ఇలా చేయడం ద్వారా మీరు వంటకాలకు అవసరమైన నిమ్మరసాన్ని సులభంగా పొందవచ్చు. ఇలాంటి కొన్ని సులభమైన వంటగది చిట్కాలు.. వంట పనులను, వంట సామానుల శుభ్రతను సులభతరం చేస్తాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *