Maha Kumbh Fire Incident: భయంకరమైన ప్రదేశంలా కాదు.. ఆధ్యాత్మికానికి కేంద్ర బిందువుగా మారాలి: సద్గురు

Maha Kumbh Fire Incident: భయంకరమైన ప్రదేశంలా కాదు.. ఆధ్యాత్మికానికి కేంద్ర బిందువుగా మారాలి: సద్గురు


Sadhguru: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఆదివారం సాయంత్రం సెక్టార్ 19 క్యాంప్‌సైట్ ప్రాంతంలో సిలిండర్లు పేలడంతో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో స్థలానికి చేరుకున్న అధికారులు, సహాయక చర్యలు ప్రారంభించారు. స్వల్ప వ్యవధిలో మంటలను ఆర్పారు. అధికారుల మేరకు క్యాంప్ సైట్‌లో మంటలు చెలరేగాయని, అక్కడ ఏర్పాటు చేసిన గుడారాలను మంటలు చుట్టుముట్టాయి. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) బృందం మంటలను అదుపు చేసింది. ఈ ఘటనలో కొన్ని గుడారాలు మంటల్లో కాలి బూడిదయ్యాయి.

ఈ క్రమంలో సీఎం యోగి ఆతిథ్యనాథ్ ఘటనా స్థలానికి వచ్చి, సహాయక చర్యలను పరీశిలించారు. అధికారులు, ప్రత్యక్ష సాక్షులను అడిగి ప్రమాదంపై వివరాలు తెలుసుకున్నారు. అలాగే, ప్రధాని నరేంద్ర మోదీ కూడా సంఘటన వివరాలను తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆతిథ్యనాథ్‌తోపాటు అధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ ట్వీట్ చేసి, జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పెద్ద సంఖ్యలో ప్రజలు ఒకే చోట గుమిగూడినప్పుడు, నిర్లక్ష్యం, అత్యుత్సాహం పనికిరాదని, మంటలు, తొక్కిసలాటలకు దారి తీసే అవకాశం ఉంటుందని, జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ అద్బుతమైన, మహత్తరమైన ఘట్టాన్ని నిర్వీర్యం చేయకుండా చూడాలని, ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని సూచించారు. అక్కడికి వెళ్లే భక్తులందరి బాధ్యత పాలనా యంత్రాంగం బాధ్యత. మహా కుంభ్ భయంకరమైన ప్రదేశంగా కాకుండా లక్షలాది మంది మానవుల ఆధ్యాత్మిక పరిణామానికి కేంద్ర బిందువుగా మారాలని కోరారు. ఎన్నో ఏళ్లకు ఒకసారి జరిగే కార్యక్రమం విజయవంతం కావడానికి అందరూ కృషి చేయాలని తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి. 





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *