
Maha Shivaratri 2025: శివ.. శివా.. ఎంత ఘోరం! పండుగపూట పుణ్యస్నానానికెళ్లి 8 మంది మృతి..
హైదరాబాద్, ఫిబ్రవరి 27: రెండు తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి వేడుకలు బుధవారం వైభవంగా జరిగాయి. అయితే ఈ పర్వదినం పలు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. వేర్వేరు ప్రాంతాల్లో పుణ్యస్నానాలకు వెళ్లి ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. దీంతో మృతుల కుటుంబాల్లో అంతులేని విషాదం చోటుచేసుకుంది. వివరాల్లకెళ్తే.. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా తాడిపూడిలోని గోదావరిలో బుధవారం నాడు కొందరు విద్యార్ధులు పుణ్యస్నానానికి వెళ్లారు. వీరిలో ఐదుగురు విద్యార్థులు గోదావరిలో గల్లంతై చనిపోయారు. బుధవారం తెల్లవారుజామున 11 మంది…