
Kishan Reddy: తెలంగాణలో పెట్టుబడులకు సిద్ధం ఉన్నాం.. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ
తెలంగాణలో పునరుత్పాదక విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ముందుకొస్తున్నాయని.. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రూ.10 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు కోల్ ఇండియా, ఎన్ఎల్సీ (NLC) ఇండియా సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థల తరపున పునరుత్పాదక ఇంధన (రెన్యూవబుల్…