
ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో భూప్రకంపనలు.. భయంతో జనం పరుగులు..
తెలంగాణలోని పలు జిల్లాల్లో స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ప్రధానంగా.. ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో భూమి కంపించింది. ఉన్నట్టుండి భూమి కంపించడంతో భయపడిపోయారు. ఇళ్ల నుంచి పరుగులు తీశారు. భూప్రకంపనలకు సంబంధించిన దృశ్యాలు ఆయా ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ప్రధానంగా.. ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో భూమి కంపించింది. సుమారు 2 నుంచి 5 సెకన్ల పాటు భూమి కంపించింది. భూకంప లేఖినిపై తీవ్రత 3.8గా నమోదైంది. కరీంనగర్ జిల్లాలో చాలా చోట్ల…