
పాక్‌పై భారత్ దాడి చేస్తే.. చైనాతో కలిసి ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకోండి! మాజీ సైనికాధికారి వివాదాస్పద వ్యాఖ్యలు
26 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇద సందు అన్నట్లు.. బంగ్లాదేశ్ మాజీ సైనిక అధికారి ఫజ్లుర్ రెహమాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా పాకిస్తాన్‌పై భారత్‌కి వెళ్తే.. బంగ్లాదేశ్, చైనాతో కలిసి ఇండియాలోని ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకోవాలని సూచించారు. అయితే రెహమాన్ చేసిన ఈ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదంటూ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది….