
ఎయిర్ పోర్ట్ రన్‌వేపై కూర్చోని పరీక్ష రాసిన 300 విద్యార్థులు! ఎందుకంటే..?
రన్‌వేపై విమానాలు ల్యాండింగ్, టేకాఫ్ అవుతుంటాయనే విషయం అందరికీ తెలుసు. కానీ, మీరు ఎప్పుడైనా విమానాశ్రయ రన్‌వేపై విద్యార్థులు పరీక్షలు రాయడం చూశారా. ఇది బీహార్‌లోని సహర్సా జిల్లాలో ఈ వింత సంఘటన జరిగింది. విమానాశ్రయ రన్‌వేపై దాదాపు 300 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. రన్‌వేపై విద్యార్థులు పరీక్షలు రాస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నిజానికి సహర్సా విమానాశ్రయ ప్రాంగణంలో ఒక ప్రైవేట్ అకాడమీ బీహార్ పోలీస్, బీఎస్ఎఫ్, ఆర్మీలో చేరాలనుకునే విద్యార్థులకు…