రాక్షస గురువు శుక్రుడు ప్రస్తుతం మకరరాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు ఒక రాశిలో ఒక నెల పాటు ఉంటాడని వేద జ్యోతిష్యం చెబుతోంది. డిసెంబర్ 28న శుక్రుడు మకర రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. కుంభ రాశికి అధిపతి శనీశ్వరుడు. ఈ కుంభరాశిలో శుక్రుని సంచారం మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. అయితే ఇలా శుక్రుడు మార్పు ముఖ్యంగా మూడు రాశులకు చెందిన వారికి అదృష్టాన్ని తీసుకుని వస్తుంది. వీరు అపారమైన సంపద, కీర్తి ప్రతిష్టలను పొందనున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ మూడు అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం.
వృషభ రాశి: కుంభరాశిలో శుక్రుని సంచారం వృషభ రాశికి చెందిన వ్యక్తులకు గొప్ప ప్రయోజనాలను ఇస్తుంది. ఎందుకంటే వృషభ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు వృషభ రాశిలోని కర్మ గృహంలో సంచరించనున్నాడు. ఈ కాలంలో నిరుద్యోగులుగా ఉన్న వృషభ రాశి వారికి ఉద్యోగం లభిస్తుంది. అంతేకాదు వృషభ రాశి వారు తమ జీవిత భాగస్వామితో కలిసి విహార యాత్రకు వెళ్ళే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు ఈ కాలంలో పురోగతికి కొత్త అవకాశాలను పొందనున్నారు. ఈ సమయంలో వ్యాపారస్తులకు ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి.
మేష రాశి: కుంభరాశిలో శుక్రుని సంచారం మేష రాశి వారికి లాభదాయకమైన పరిస్థితిని సృష్టించగలదు. ఎందుకంటే ఈ కాలంలో శుక్రుడు మీ రాశికి చెందిన వ్యక్తుల జాతకంలో ఆదాయ, లాభ గృహంలో ఉంటాడు. దీని వల్ల వీరి ఆదాయం పెరుగుతుంది. అంతేకాదు ఉద్యోగరీత్యా మేష రాశి వారికి పురోగమించే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో వ్యాపారంలో భారీ ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది. దీంతో వీరు భవిష్యత్తులో భారీ లాభాలను ఆర్జిస్తారు. స్టాక్ మార్కెట్ సహా డబ్బు పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఈ సమయం శుభ సమయం.
ఇవి కూడా చదవండి
మిథున రాశి: ఈ రాశికి చెందిన వారికి ఈ శుక్రుని సంచారము వలన శుభ ఫలితాలు పొందనున్నారు. ఈ కాలంలో శుక్రుడు మిథునరాశి వ్యక్తుల విధి స్థానంలో సంచరించనున్నాడు. అదృష్టం వీరి సొంతం. పేదలకు ఆహారం, నిత్యవరస వస్తువులు వంటి వాటి కోసం డబ్బులు ఖర్చు చేస్తారు. విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. సామాజిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఈ రాశి వారు చేపట్టిన ప్రతి పనిలో అదృష్టం కలిసి వచ్చి విజయాన్ని సొంతం చేసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.