చాలా మందికి తుమ్మినప్పుడు, గట్టిగా దగ్గినప్పుడు, బరువులను ఎత్తినా, గట్టిగా పగలబడి నవ్వినా మూత్రం లీక్ అవుతూ ఉంటుంది. ఈ సమస్యను పెద్దగా ఎవరూ పట్టించుకోరు. బయటకు చెప్పేందుకు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. కటి ప్రాంతంలో ఉండే కండరాలు బలహీన పడటం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది.
ఈ సమస్య ఎక్కువగా ఆడవాళ్లలో ఎక్కువగా కనిపిస్తుంది. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుందంటే.. మహిళలు పిల్లలకు జన్మ నిస్తారు. ఈ సమయంలో పెల్విక్ దెబ్బతినడం వల్ల లేదా బలహీన పడటం వల్ల, గర్భసంచి తొలగించిన మహిళలకు కూడా ఈ సమస్య వస్తుంది.
కంట్రోల్ చేసినా మూత్రం ఆగకుండా పడిపోతుంది. కొంత మందికి ఎక్కువగా పడితే.. మరికొంత మంది డ్రాప్స్ పడుతూ ఉంటాయి. యూరిక్ వచ్చినా ఎక్కువు సేపు ఆపుకోలేరు.
పురుషుల్లో అయితే ప్రొస్టేట్ గ్రంథిని తొలగించడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. పురుషులైనా, మహిళలైనా ఈ సమస్యను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.
అలాగే లైఫ్ స్టైల్లో కూడా మార్పులు చేసుకోవాలి. బరువులు మోయడం తగ్గించాలి. కెఫిన్ ఉండే ఆహారాలు, డ్రింక్స్ తక్కువగా తీసుకోవాలి. బరువును కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)