Headlines

Watch: రీల్స్‌ చేస్తుండగా దారుణం.. తల, మొండెం వేరై 20ఏళ్ల యువకుడు మృతి..షాకింగ్‌ వీడియో వైరల్..

Watch: రీల్స్‌ చేస్తుండగా దారుణం.. తల, మొండెం వేరై 20ఏళ్ల యువకుడు మృతి..షాకింగ్‌ వీడియో వైరల్..


ఇంటర్నెట్ యుగంలో ఎవరూ, ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికీ తెలియడం లేదు. రీళ్ల తయారీపై ప్రజల్లో క్రేజ్ బాగా పెరిగిపోయి తమ ప్రాణాలను సైతం పట్టించుకోవడం లేదు. కొన్నిసార్లు కొందరు కదులుతున్న రైలుకు అడ్డంగా నిలబడి వీడియోలు తీసుకుంటున్నారు..కొన్నిసార్లు వీడియో మరొక ప్రమాదకరమైన ప్రదేశంలో రీల్స్‌ కోసం ట్రై చేస్తుంటారు. ఇక దాంతో ఎదురయ్యే ప్రమాదాలు, ఇతరులకు కలిగే ఇబ్బందులను అసలే పట్టించుకోరు. ఈ క్రమంలోనే తాజాగా ఓ 20 ఏళ్ల యువకుడు రీల్‌ కోసం ట్రై చేస్తూ దుర్మరణం పాలైన షాకింగ్ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా సైట్ Xలో శ్యామ్ ద్వివేది అనే ఖాతాదారు పోస్ట్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో రీలు తయారు చేస్తున్న యువకుడి తల శరీరం నుంచి తెగిపడిపోయింది. కేవలం 5 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో 5 మంది యువకులు ఉన్నారు. ఇద్దరు యువకులు నేలపై కూర్చుని తమ పని చేసుకుంటున్నారు. ఓ యువకుడు షాపు షట్టర్ తెరవడానికి రెడీ అవుతున్నాడు. మరో యువకుడు అక్కడే నిలబడి డ్యాన్స్ చేస్తున్నాడు. ఆ యువకుడు రీల్‌ తీస్తున్నట్లు వీడియో ద్వారా స్పష్టంగా కనిపిస్తోంది. స్లో మోషన్‌లో అతడు పాటకు డ్యాన్స్‌ చేస్తూ.. తన ఎదురుగా ఉన్న గ్యాలరీలో అమర్చిన ఐరన్‌ నెట్‌ని పైకి లేపాడు.. అంతే..అతడు బ్యాలెన్స్‌ కంట్రోల్‌ చేయలేకపోయాడు.. అదుపు తప్పి ఆ యువకుడు కింద పడిపోయాడు. అతని తల శరీరం నుండి తెగి పడిపోయింది. తలనుంచి మొండెం తెగి అమాంతంగా కిందకు పడిపోయాడు. అక్కడున్న యువకులంతా అతన్ని కాపాడేందుకు పరుగులు తీశారు. అప్పటికే ఆ యువకుడి తల శరీరం నుండి విడిపోయింది. యువకుడి మృతదేహం నాలుగో అంతస్తు నుంచి మూడో అంతస్తు వరకు పడిపోయింది. అక్కడి నేలంతా నెత్తూరు ప్రవహించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోపై క్లిక్ చేయండి..

సమాచారం మేరకు శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో యువకులంతా దుకాణం తెరిచేందుకు వచ్చారు. అంతలోనే ఊహించిన విధంగా యువకుడు మృత్యువాతపడ్డాడు.  మృతి చెందిన యువకుడి పేరు ఆసిఫ్ (20) అని, అతని తండ్రి పేరు సలీం అని తెలిసింది. అతను అబాద్ నగర్ పోలీస్ స్టేషన్ తాజంగంజ్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఆసిఫ్ నమక్ మండిలోని సరాఫా బజార్‌లోని నగల దుకాణంలో పనిచేసేవాడని తెలిసింది. సమాచారం అందిన పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. మృతదేహాన్ని పోస్ట్‌ మార్టం నిమిత్తం తరలించారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *