
Telugu Astrology: శుక్ర, చంద్రుల యుతి.. ఈ రాశులకు భోగభాగ్యాలు తప్పనిసరి!
ఈ నెల(జులై) 20, 21, 22 తేదీల్లో మూడు రోజుల పాటు వృషభ రాశిలో శుక్ర, చంద్రుల యుతి జరుగుతోంది. ఈ రాశి చంద్రుడికి ఉచ్ఛ క్షేత్రం కాగా, శుక్రుడికి స్వక్షేత్రం. సుఖ సంతోషాలకు, విలాసా లకు, శృంగార జీవితానికి, ప్రేమలకు, పెళ్లిళ్లకు, భోగభాగ్యాలకు కారకుడైన శుక్రుడు మనస్సుకు కారకుడైన చంద్రుడితో కలవడం వల్ల కొన్ని రాశుల వారికి మనసులోని కోరికలు తీరే అవకాశం ఉంది. ఆదాయం వృద్ధి చెందడం, కెరీర్ పరంగా అనుకూలతలు పెరగడం, ప్రేమల్లో…